పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీతో పొత్తు లేదు.. ఇదే ఫైనల్: కాంగ్రెస్

  • రాహుల్‌తో మీటింగ్ అనంతరం కాంగ్రెస్ స్పష్టీకరణ
  • పార్టీ నేతలు, కార్యకర్తలు సముఖంగా లేరన్న రాష్ట్ర చీఫ్
  • ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చేసింది. టీఎంసీతో ఎటువంటి పొత్తు ఉండబోదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోమేంద్రనాథ్ మిత్రా తేల్చి చెప్పారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ టీఎంసీతో పొత్తుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో మమతా బెనర్జీ 34 స్థానాలను గెలుచుకున్నారు. కాగా, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Go Back to Shorts
Congress
West Bengal
TMC
Rahul Gandhi
Mamata Banerjee

More Telugu News